calender_icon.png 26 January, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్క నిరుపేదకు సంక్షేమ పథకాలు

25-01-2025 12:00:00 AM

గ్రామ సభలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ శేట్కర్ 

నాగల్‌గిద్ధ, జనవరి 24: నాగల్ గిద్ద మండల పరిధిలోని కారస్ గుత్తి గ్రామంలో ఈరోజు ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి   అనంతరం ఎంపీ  సురేష్ శేట్కర్ మాట్లా డుతూ  కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుపేదలకు అర్హులైన వారికి ప్రతి ఒక్క పథకం అందిస్తామని పార్టీలకతీతంగా అర్హు లైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామన్నారు.

  అర్హులైన అందరికీ అన్ని పథకాలు వర్తిస్తాయని అపోహాలు పెట్టుకోవద్దని ప్రజలను వివరించారు రైతు భరోసా పథకం జనవరి 26వ తేదీ నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో పడతాయని అన్నారు ప్రతి పేదవారికి అందిస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ రైతు భరోసా అందిస్తారని అన్నారు.

నారాయణ ఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, పేద ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అన్నారు  అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల తాసిల్దార్ శివకృష్ణ, ఎంపీడీవో మహేశ్వర రావు,  ఏఈఓ స్రవంతి, శంకరయ్య స్వామి మాజీ ఎంపీపీ, మాణిక్ రావు  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గుండే రావు పాటిల్,ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్,శ్రీకాంత్ , పిఎసిఎస్ ఛైర్మెన్,సచిన్ పాటిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు,వినోద్ పాటిల్, విఠల్ రెడ్డి, సోపన్ రావు, అంబ్రెష్,రూఫ్ సింగ్ మంజి జడ్పీటీసీ,మరియు కారస్ గుత్తి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు