calender_icon.png 23 January, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు

23-01-2025 12:41:24 AM

పార్టీలకతీతంగా, వర్గాలకు అతీతంగా అర్హత ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్‌లుప్రతి 30 కి.మీ లకు రహదారి  ప్రమాద బాధితులకు ట్రామా కేర్ సెంటర్, డయాలిసిస్ సెంటర్  ఏర్పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి.

మహబూబ్ నగర్ జనవరి 22 (విజయ క్రాంతి) : అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజన ర్సింహ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త కప్పెట గ్రామం లో ప్రజా పాలన గ్రామ సభకు, దేవరకద్ర పట్టణంలో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనం కు మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా,వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆసుపత్రి భవనం సంవత్సరం లోపు పూర్తి చేస్తామని అన్నారు. వైద్య శాఖలోవినూత్న ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. రహదారులు విస్తరిస్తున్న క్రమంలో రహదారులపై ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యవసర చికిత్స అందించేందుకు ప్రతి 30 నుండి 40 కి.మీ. పరిధిలో ట్రామా కేర్ సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే క్షత గాత్రులకు చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడ వచ్చని అన్నారు.అంబులెన్స్ ద్వారా త్వరగా దగ్గర లో ఉన్న ట్రామా సెంటర్ కు తీసుకు వెళ్లి చికిత్స అందించ వచ్చని తెలిపా? దేవరకద్ర లో 100 పడకల ఆసుపత్రి తో పాటు ట్రామా కేర్ సెంటర్,డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తునట్లు మంత్రి  తెలిపారు. ప్రభుత్వం డాక్టర్‌లు, నర్స్‌లు నియామకం  చేసిందని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో కార్డియాలజీ విభాగం సేవలు లేవని తన దృష్టికి వచ్చిందని,కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేసి సేవలు అందిస్తామని, ఇంకా  ఎటువంటి చికిత్స అవసరం ఉన్నా రోగులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.MRI లేదని, ఎం.అర్.ఐ స్కానింగ్ యంత్రం రాబోయే ఉగాదిలోగా జనరల్ ఆసుపత్రి లో ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

కిడ్నీ వ్యాధి గ్రస్తులైన పేదలు చికిత్సకు పట్టణం లోని జిల్లా ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుందని, పేద రోగులకు చికిత్స అందించేందుకు ప్రతి 30 కి.మీ.పరిధి లో డయాలసిస్ సెంటర్  కి.మీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జానంపేటలో ట్రామా సెంటర్, చిన్న చింతకుంట లోడయాలిసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో వాగ్దానాలు నెరవేర్చు కుంటూ పోతున్నట్లు తెలిపారు. గ్రామ సభల్లో  దరఖాస్తు లు తీసుకుని పరిష్కారం చేయుటకు ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల కు దరఖాస్తు చేసుకొని వారు దరఖాస్తు చేసుకోవాలని,

అర్హత ఉన్న కుటుంబం కు సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులు  ప్రజలను దోపిడీ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దేవరకద్ర శాసన సభ్యులు జి.మధు సూదన్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం లో విద్యా, వైద్యం, సాగు నీటి రంగాల్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

దేవరకద్రలో డిగ్రీ కళాశాల కళాశాల తీసుకు వచ్చామని, కోర్టు  కూడా త్వరలో ఏర్పాటు  చేయనున్నట్లు తెలిపారు. సంవత్సరం లోపు100 పడకల ఆసుపత్రి పూర్తి చేసి అందుబాటులో తీసుకువస్తామని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్.పి.డి.జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, స్థానిక సంస్థల కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, అర్.డి. ఓ నవీన్,నియోజక వర్గ ప్రత్యేక అధికారి డి.ఎఫ్. ఓ సత్య నారాయణ, మండల ప్రత్యేక అధికారి వేణు గోపాల్, డి.అర్.డి. ఓ నర్సింహులు, గృహ నిర్మాణ పి.డి.వైద్యం భాస్కర్, మండల, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు