తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, సెస్టెంబర్ 24 : (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టులైన ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందేలా చూస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.
నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని వివిధ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిస్టులు, స్కానింగ్ ఆపరేటర్లు, లైబ్రేరియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్తాపత్రికల ప్రచురణలో వీరు ముఖ్యపాత్ర పోషిస్తున్నార న్నారు.
విరాహత్ అలీ మాట్లాడుతూ.. ఆర్టిస్టులు, లైబ్రేరియన్లు, స్కానింగ్ ఆపరేటర్లు న్యూస్‌రూమ్స్‌లో అంతర్భాగమని, వార్తా పత్రికల తయారీలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అనంతరం బి.శ్రావణ్‌కుమార్, భానుప్రసాద్ సింగీతం ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు తమ సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.