calender_icon.png 13 February, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

13-02-2025 12:00:00 AM

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి 

మేడ్చల్, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కీసర మండలంలోని కీసర, చీర్యాల గ్రామాలలో 71 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అందిస్తామ న్నారు. అంతకుముందు కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవములో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ శర్మ, పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ వజ్రెశ్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.