మహబూబ్ నగర్ జనవరి 26 (విజయ క్రాంతి) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం ఇబ్రాహీం బాద్ గ్రామం లో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, మీలో మీరే మాట్లాడుకొని ఎలాంటి సందేహాల గురి కాకూడదని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ,ఇందిరమ్మ ఇండ్లు, పథకాలను ప్రారంభించుకోవడం శుభతరణం అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. అర్హులై ఉండి మంజూరు కానీ వారు ఎవరైనా ఉంటే పథకాలకు మరో వారు దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇబ్రహీంబాద్ స్పెషల్ ఆఫీసర్ డి.అర్.డి. ఓ నర్సింహులు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఆర్డీవో, తహసీల్దార్, ఎంపిడిఓ, మండల,గ్రామ అధికారులు పాల్గొన్నారు.