calender_icon.png 30 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు

27-01-2025 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జనవరి 26 : అరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన గణతంత్ర వేడుకలలో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. డా.బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించబడిన భారత రాజ్యాంగం వివిధ వర్గాలకు, ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చిందన్నారు.

తెలంగాణ రాష్ర్టం అవతరించిన పదిన్నర సంవత్సరాల కాలంలో రాష్ర్ట ప్రజల బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు పథకాలను నీటి నుండి అమలు చేస్తుండడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యురాలు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, అదనపు ఎస్పి జనార్దన్ రెడ్డి, డిఆర్‌డి ఎపిడివివి అప్పారావు, ఆర్‌డిఓ వేణుమాధవ్, సిపిఓ కిషన్, డిపిఓ నారాయణ రెడ్డి, డిఈఓ అశోక్ పాల్గొన్నారు.