నాతాళ్ల గూడెంలో నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
యాదాద్రి భువనగిరి జనవరి 26 (విజయక్రాంతి) ః ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అరులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందివ్వడం జరుగుతుందని రాష్ర్ట నీటిపా రుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆదివారం రోజు వలిగొండ మండలం లోని నాతాళ్ల గూడెం గ్రామం లో ఏర్పాటుచేసిన ఆయా పథకాల పంపిణీ కార్యక్రమానికి పార్లమెం టు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత రావు తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి నాలుగు పథకాలను లాంఛనంగా ప్రారం భించారు.
ఆయా పథకాల కింద అరులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అంద జేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. ముఖ్యమం త్రి సందేశాన్ని గ్రామ ప్రజలు వీక్షించారు. మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రభుత్వ మార్గదర్శకాల కు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభు త్వ సంకల్పం అని అన్నారు.ప్రజల జీవన పెంపొందించేందుకు సంక్షేమ పథకాలను తీసుకొని రావడం జరిగింది తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలు ప్రారంభించు కోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆత్మీయ భరోసా కింద గుంట భూమిలేని నిరుపేదలకు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున మొదట విడత ఆరు వేల చొప్పున, రెండో విడత ఆరు రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎకరానికి 12,000 చొప్పున అరులైన వారికి అందివ్వడం జరుగుతుందని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు అరత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, అదనంగా కుటుంబ సభ్యులను పేర్లు యాడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంద న్నారు. ఇందిరమ్మ ఇల్లు అరత కలిగిన వారందరికీ ఇవ్వడం జరుగుతుందని, ఇంటి స్థలం ఉండి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇ బి సి, విద్యార్థులకు, యువజనుల పురోగతితో పాటు యావత్ తెలంగాణ రైతాంగానికి చేయూతనివ్వడం జరుగుతుందని తెలిపా రు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఇవ్వడం జరిగిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇవ్వడం జరిగిందని, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు.
భారతదేశ చరిత్రలోనే ఎక్కువ గా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలని, భూమిలేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అరులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందు తాయి ఎవరు నిరాశ చెందవద్దు తెలిపారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
గ్రామ సభలు పెట్టిందే అరులైన వారిని ఎంపిక చేసి అందరి సమక్షంలో సమావేశమై చర్చించి అరులకు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హు లైన లబ్ధిదారులు లిస్టులో పేరు ఆందోళన కు గురికా వద్దని అరులందరికీ అధికా రులు పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేపట్టిన నాతాళ్ళగూడెం నుండే నాలుగు పథకాలను లాంఛనం గా అరులకు పత్రాలు ఇవ్వడం సంతోష మన్నారు.
రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు అరులైన అందరికీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు పై సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశం ప్రభు త్వానికి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ హను మంతరావు మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అరులైన వారికి ఈ పథకాలు.
ఈ గ్రామాన్ని ఎన్నుకో వడంతో పండగ వాతావరణంలో అట్టహా సం గా నాలుగు పథకాలు అరులైన లబ్ధిదా రులకు పత్రాలు లాంఛనంగా ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భువనగి రి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వలిగొండ మార్కెట్ చైర్మన్ భీమా నాయక్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ, ఆర్‌డీవో కృష్ణారెడ్డి, డీఆర్‌డీవో నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.