calender_icon.png 31 January, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు

22-01-2025 12:58:50 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తలకొండపల్లి, జనవరి 21 (విజయ క్రాంతి): ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలన్ని పార్టీల కతీతంగా అర్హులైన పేదలందరికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు.

తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు వెల్జాల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో ముఖ్యఅథిదిగా హాజరై ప్రసం గించారు. గత ప్రభుత్వ హయంలో సంక్షేమ పథకాలు అనర్హులకు అందాయని లెక్కలతో సహ వివరించారు.

అదేవిదంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు,డబల్ బెడ్రూం ఇండ్లు యిస్తామని చెప్పి అదికారం లోకి వచ్చి ఒక్క ఇళ్లు కుడా ఇవ్వాలేదని దుయ్యబట్టారు.అందుకే ప్రజలు కాంగ్రేస్ పార్టీని అదికారం లోకి తెచ్చారని చెప్పారు.

కాంగ్రేస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజల కిచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని ఘంటాపథంగా చెప్పారు.గత ప్రభుత్వం రైతు బందులో ఈ మండలంలో రూ.50 కోట్లు అనర్హులకు అందాయని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూ రులో మొదటి విదితగా ఇంటి స్తలం ఉండి ఇల్లు లేనివారికి ప్రాధాన్యత ఉంటుందన్నా రు.

అదే విదంగా భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ 12 వేలు ఇస్తుందని   ఇందులో అపోహలకు తావు లేదన్నారు. మండల వ్యాప్తంగా రేషన్ కార్డుల కొరకు 2595 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇందులో అర్హులైన అందరికి కార్డులు మంజూరు ఐతాయని హమీచ్చారు.

కల్వకుర్తి ఎత్తి పొతల ద్వార తలకొండపల్లి ప్రాంతానికి తప్పకుండా సాగునీరు తీసుకొస్తానని హామి ఇచ్చారు. ఆదికారులు పార్టీలకతీతంగా పనిచేయాలని ఇష్టానుసా రంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అదికారు లను హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీకాంత్, తహసీల్దార్ నరేందర్, పిఎసిఎస్ ఛైర్మన్ గట్ల కేశవరెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు అంజయ్యగుప్త, అజీం, మాజీ ఎంపిపి రఘు రాములు, మాజీ సర్పంచ్ లలితజ్యోతయ్య, నాయకులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, రవీందర్ యాదవ్, డిగ్రీ కృష్ణ, గ్రామ కార్యదర్శి సత్యంలు పాల్గొన్నారు.