రాష్ర్ట ప్రభుత్వ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
పెన్ పహాడ్, జనవరి 26 : స్యాచురేషన్ ప్రకారమే ప్రజాపాలన సంక్షేమ పథకాల అమలు అమలకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మండల పరిధిలోని దుబ్బ తండాలో ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా ,ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కోత్త రేషన్ కార్డులను, ఘనంగా ప్రారంభించి మాట్లాడుతూ..
ఇదే అసలైన ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు ఆనందంతో స్వేచ్ఛ వాయువులను ఆస్వాదిస్తూ ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మ గౌరవంతో ముందుకు పోవడానికి అడుగులు వేస్తున్నార న్నారు.
ఇచ్చిన మాట ప్రకారం భూమి లేని పేదలకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 అందించడం ప్రతి రైతుకు మద్దతుగా ప్రతి ఎకరానికి 12,000 అందించడం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడం గత పదేండ్లలో నిర్లక్ష్యానికి గురైన దారిద్ర రేఖకు దిగువున ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇవ్వటం కోసం ఈ పథకాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ప్రసాద్, తహసిల్దార్ , ఎంపీడీవో, ఏవో, ఏపీఓ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ రావు, కోటేశ్వరరావు, పద్మ, కవిత, సందీప్, సందీప్ రాథోడ్, జనార్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.