calender_icon.png 30 January, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి

26-01-2025 10:37:15 PM

రాష్ట్ర గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్...

కామారెడ్డి (విజయక్రాంతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ శరత్ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్వాగట్లపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను ఆదివారం ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇస్తుందన్నారు. రానివారు ఎవరు కూడా అధైర్యపడవద్దని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపారు.

అర్హత అయిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. రానివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లెటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి రజిత, తాహసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, ఆర్ఐ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మహేష్ గౌడ్, ప్రశాంత్ గ్రామ రైతులు పాల్గొన్నారు.