కాప్రా: మారుతి మిత్ర మండలి ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనువంశిక చైర్మన్ గౌడ్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ పోచమ్మ ఆలయం వద్ద సింగిరెడ్డి వికాస్ రెడ్డితో కలిసి అమావాస్య అన్నదాన కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏర్పడి పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు హర్షానియమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మారుతి మిత్ర మండలి అధ్యక్ష, కార్యదర్శులు గురుమంచి అశోక్ చారి వరుగంటి హనుమంతు, కోశాధికారి మచ్చ బాబు, సభ్యులు అమరచారి, వేణుగోపాల్ చారి, కాసుల శ్రీకాంత్ గౌడ్, సింగిరెడ్డి వెంకటరెడ్డి, కొమురెల్లి సుధాకర్ రెడ్డి, ఫన్నీ బద్రి తదితరులు పాల్గొన్నారు.