calender_icon.png 20 September, 2024 | 4:08 PM

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

20-09-2024 01:55:33 PM

ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల,(విజయక్రాంతి): మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణ మెహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం మల్దకల్,గట్టు రైతు వేదిక భవనం ఆవరణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ పొందుతున్న వారికి గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి రూ.500లకే ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామన్నారు.

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు అందజేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.యావత్తు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరి ఆశీస్సులతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు.సిలిండర్ ధర రూ.400 నుండి రూ.1000 పెంచిన ఘనత గత బీజేపీ,బిఆర్ఎస్  ప్రభుత్వాలదేనని అన్నారు.గతంలో మహిళలకు చేయూత అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నేడు మళ్లీ వారికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.

త్వరలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500 ఇస్తామని అన్నారు. సంబంధింత అధికారులతో.గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు ఆడపడుచులు కట్టెల పొయ్యి తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. కట్టెలపై వాడడం వల్ల ప్రస్తుతం మహిళలకు కంటి సమస్యలు, వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది కాబట్టి సీఎం  దూర దిష్టితో ఆలోచించి గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు కూడా గ్యాస్ సిలిండర్లో వంట చేసుకుని విధంగా ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి 500 రూపాయలు సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. సబ్సిడీ అమౌంట్ను 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ కావడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ హనుమంతు, పిఎసిఎస్ ఛైర్మన్ లు తిమ్మారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.