calender_icon.png 27 December, 2024 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల బాగోగులను పట్టించుకోవాలి

27-12-2024 02:12:25 AM

* యంత్రాంగం పారదర్శకంగా పథకాలు అమలు చేయాలి

* నారాయణపేట జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్

నారాయణ పేట, డిసెంబర్ 26 (విజయక్రాంతి): నిరుపేదల బాగోగులను యంత్రాం గం పట్టించుకోవాలని, పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని  కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదేశించారు. నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌శ్యాం, ట్రైనీ కలెక్టర్ గరిమ నరులతో కలిసి గురువారం ఆయన నర్వ మండలం రాయ్‌కోడ్ లో పర్యటించారు.

తొలుత ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి స్థానిక అంగర్‌వాడీ కేంద్రాన్ని  సందర్శించారు. కేంద్రంలో చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై ఐసీడీఎస్ అధికారులను ఆరా తీశారు. గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని పల్లె దవాఖానను సందర్శించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచించారు.

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నియోజకవర్గానికి నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2028 నాటికి భారత్‌ను ఆర్థిక ప్రగతిలో ప్రపచంలోనే మూడో స్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

కేంద్రం దేశవ్యాప్తంగా వెనక బడిన ప్రాంతాలను గుర్తిం చి, వాటి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆయా ప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు, నారాయణపేట జిల్లాల్లో 10 ఆస్పిరేషన్ బ్లాక్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు.