calender_icon.png 5 April, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సంక్షేమం సీఎం రేవంత్‌రెడ్డితోనే సాధ్యం

27-03-2025 01:03:12 AM

వికలాంగుల హక్కుల పోరాట సమితి  జిల్లా కార్యదర్శి రుద్ర తిరుపతి 

మహబూబాబాద్, మార్చి 26 (విజయకాంతి): వికలాంగులు, వితంతువులు వృద్ధుల, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి రుద్ర తిరుపతి అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని వికలాంగుల కార్యకర్తల మండల అధ్యక్షుడు గుర్రం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వికలాంగులకు వర్తింపచేయాలని, ప్రభుత్వం సదరం క్యాంపులు రద్దు చేయడం జరిగిందని వారి స్థానంలో వివిధ గ్రామాలలో వికలాంగులు తమ వద్ద ఆధార్ కార్డు సదరం మెడికల్ సర్టిఫికెట్లు తీసుకొని స్థానిక మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని జిల్లా అధికారులు తెలిపారని అన్నారు. కాబట్టి అర్హత గల వికలాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.