calender_icon.png 10 March, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద పట్టభద్రులకు సంక్షేమ నిధి

26-01-2025 12:08:11 AM

కరీంనగర్ సిటీ, జనవరి25(విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను  గెలిపిస్తే నిరుపేద ఉపాధ్యాయుల కోసం  సంక్షేమానికి నిధి ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి తోడు పడతానని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్  మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. శనివారం కరీంనగర్ పట్టణంలో పలువురి పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు..

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పలువురి పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు విఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను అందజేశారు.. ప్రైవేటు విద్యారంగం నుండి  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. తాను గెలిస్తే ఒక ప్రైవేటు టీచర్ గెలిచినట్టేనని తెలిపారు.