calender_icon.png 18 January, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత గల నిరుపేదలకే సంక్షేమ ఫలాలు

18-01-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెడ్డిపల్లిలో సర్వే తీరు పరిశీలన

నర్సాపూర్(మెదక్), జనవరి 17: అర్హులైన నిరుపేదలందరికి సంక్షేమ ఫలాలు అందుతాయని, సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని చైతన్యపురి కాలనీలో రేషన్ కార్డు వెరిఫికేషన్, నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలోని సాగు చేయని భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో కలిసి సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం,అమలు చేస్తున్నట్లు రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దని, రైతు భరోసా పథకానికి 12 వేలు పెట్టుబడి సహాయం అందుతుందన్నారు.

భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12 వేలు రూపాయలను అందించనున్నట్లు, ఒక్కో విడతకు 6 వేల చొప్పున రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించనుందని, చెప్పారు. అర్హత వున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.