calender_icon.png 13 January, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

13-01-2025 02:08:17 AM

* జిల్లా ఇంచార్జి మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్, జనవరి 12 (విజయక్రాంతి): రాజకీయాలకతీతంగా అర్హత ఉన్న చివరి లబ్దిదారు వరకు సంక్షేమ ఫలాలు అందజే స్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ర్ట నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరి యంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికా సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి యో గ్యమైన భూమికి ఏడాదికి 12 వేల రైతు భరో సా, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేలు, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వబో తున్నామని అన్నారు.

రేషన్ కార్డులలో అడి షనల్ ఫ్యామిలీ మెంబర్లను యాడ్ చేస్తామ ని, 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ, వచ్చే నెల నుంచి 6 కిలోల సన్నబియ్యం అందజే స్తామన్నారు. 22,500 కోట్లతో ప్రతి నియో జకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ర్టవ్యాప్తంగా ఇల్లులేని వారికి నాలుగున్న ర లక్షల ఇండ్లు, పూర్తికాని డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తిచేసి లబ్దిదారులకు ఇస్తామ న్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చివరి లబ్దిదారు వరకు న్యాయం చేస్తామన్నారు.

కాళేశ్వరం నీరు వాడకుండానే 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగయిందని, దే శంలోకెల్లా ధాన్యం సాగులో తెలంగాణ నెం బర్వన్గా నిలిచిందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 66.7 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగు, ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా ధాన్యం కొనుగోలు, అదే వడ్లకు మూడు రోజుల్లో రైతులకు పేమెంవ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు.

సంవత్సరంలోనే 55 వేల ఉద్యోగాల భర్తీ, 22 వేల 500 కోట్ల రుణమాఫీ చేశామ న్నారు. అభివద్ధి, సంక్షేమానికి చివరిదాకా కట్టుబడి ఉన్నామని తెలిపారు. పథకాల అమలులో సందేహాలు ఉంటే కలెక్టర్లను సంప్రదించాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు అర్కార వేణుగోపాల్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ ్క్నమార్, ఎమ్మెల్సీలు టి జీవన్ రెడ్డి, టి భానుప్రసాద రావు, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పాడి కౌశిక్ రెడ్డి, చింతకుం ట విజయరమణారావు, మక్కాన్సింగ్, డాక్ట ర్ సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేం దర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశు, సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్, పెద్ద పల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, అరుణశ్రీ, అఖిల్ మహ జన్, లక్ష్మీకిరణ్, అబ్దుల్ అజీజ్, బీమా నా యక్, వేణు, డీఎస్ లకలు పాల్గొన్నారు.

మా తాపత్రయం పేదవాళ్ల సంక్షేమం కోసమే: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు తాపత్రప యపడేది పేదవాళ్ల సంక్షేమం కోసమేనని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల, ఎలక్ట్రానిక్స్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

సమన్వయంతో సం క్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. అర్హత గల ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, యోగ్యతగల ప్రతి రైతుకు రైతు భరో సా అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. అర్హత గుర్తింపులో పొరపాటుకు తావివ్వ రాదని అన్నారు.

వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా: మంత్రి పొన్నం ప్రభాకర్

వ్యవసాయదారులకు రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12 వేలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

రాష్ర్ట ప్రజలు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులకు నోచుకోలేదని, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని తెలిపారు. ఆరు గ్యా రంటీలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర లేదన్నారు.