calender_icon.png 23 November, 2024 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వసతి గృహాలలో ఇబ్బందులు లేకుండా చూడాలి

22-11-2024 09:36:30 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): సంక్షేమ వసతి గృహాలలో విధ్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వసతి గృహల నిర్వాహణ గురించి ఆర్డీలు, తాసీల్దార్‌లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, సంక్షేమ అధికారులతో వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా సంక్షేమ వసతి గృహాలలో మెస్ కమిటీలు ఏర్పాటు చేసి కావాల్సిన నిత్యావసన సరుకులు, కూరగాయలు, బియ్యం వంటివి తప్పకుండా వారికి చూపించి రిజిష్టర్‌లలో వారి సంతకాలు చేయించాలని సూచించారు. అలాగే వంటశాల, వసతి గృహాల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. విధ్యార్ధులు చేతులు పరిశుభ్రంగా ఉంచుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రతి విధ్యార్ధి ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. 

అన్ని మండలాల్లో తాసీల్దార్లు మధ్యాహ్న భోజనంను ఆకస్మికంగా తనికీలు చేస్తూ విధ్యార్ధులు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. డీఎంసిఎస్ అన్ని వసతి గృహాలకు సకాలంలో అందేలా చూడాలన్నారు. తదుపరి ఇంటింటి సర్వే వివరాలను మండలాల వారిగా అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, సివిల్ సప్లు అధికారి రాజేశ్వర్, డీఈఓ అశోక్, డీఎసిఎస్ ప్రసాద్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ది అధికారి లత, మైనార్టీ వెల్పేర్ అధికారి జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.