calender_icon.png 30 October, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు బిల్లుల రేట్లు ఉపసంహరణ : బీఆర్ఎస్ సంబరాలు

30-10-2024 01:04:35 PM

సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డుకు బీఆర్ఎస్ ఇచ్చిన విజ్ఞప్తి మేరకు కరెంటు రేట్లు పెంచకుండా పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడాన్ని స్వాగతిస్తూ దీనిని బీఆర్ఎస్ విజయంగా భావిస్తూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లోని ఆంధ్ర కేఫ్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల పేదల పైన భారం పడుతుందని భావించిన పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ లు ముందస్తుగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ బోర్డుకు విన్నవించడం జరిగిందని తెలిపారు.

ఈ నిర్ణయం వల్ల పేదల పైన పెను భారం తగ్గిందని ఇది బిఆర్ఎస్ విజయవని ముఠా గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు రాకేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, కార్యదర్శులు శ్రీకాంత్, ఆకుల అరుణ్ కుమార్, సాయి కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, కేశపురం అరుణ్, జాంగిర్, శ్రీధర్ చారి, ఎయిర్టెల్ రాజు, పాశం రవి, వంశీ, రవిశంకర్ గుప్తా, అబ్బు బాయ్, ఆనంద్, విట్టల్, తదితరులు పాల్గొన్నారు.