calender_icon.png 2 November, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నం

01-09-2024 12:53:31 AM

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): మాజీ సీఎం కేఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్ మీడియా సమావేశంలో ప్రసంగించారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా హాజరై ప్రజల తరపున పోరాడాలని ఆహ్వానిస్తున్నట్లు చామల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల సమస్యల మీద ఇన్ని రోజులు అంటీముట్టనట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 2014, 2018లో ఇచ్చిన మేనిఫెస్టోపై, ఇపుడు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

దళిత సీఎం, దళితలకు మూడెకరాల భూమి, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వంటివేవీ అమలు చేయలేదన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం మీద పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చెరువులను కాపడుతుంటే కమీషన్ కాకతీయ రూపకర్త హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖర్గేకి బుల్డోజర్ ప్రభుత్వం అని కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారని.. ఒక మున్సిపల్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇల్లీగల్ నిర్మాణం అని తెలిసి ఎందుకు లీజుకు తీసుకున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన విద్యాసంస్థల కూల్చివేతకు సెలవుల వరకు వేచి చూస్తామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎక్స్ వేదికగా ఆరోపణలకు మాత్రమే ప్రతిపక్షం పరిమితమైందన్నారు.