calender_icon.png 5 October, 2024 | 6:47 PM

వీరులకు ఘనస్వాగతం

11-09-2024 12:00:00 AM

  1. స్వదేశంలో అడుగుపెట్టిన పారా అథ్లెట్లు
  2. పోటెత్తిన అభిమానులు
  3. పతకాలు సాధించిన అథ్లెట్లకు కేంద్రం భారీ నజరానా

ప్రతిష్ఠాత్మక పారాలింపిక్స్‌లో పతకాలతో అదరగొట్టిన మన అథ్లెట్లు స్వదేశంలో అడుగుపెట్టారు. పారిస్ నుంచి 29 పతకాలతో దేశానికి తిరిగొచ్చిన వీరులకు ఘన స్వాగతం లభించింది. పారా అథ్లెట్లను చూసేందుకు వందలాదిగా తరలివచ్చిన అభిమానుల నినాదాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం సందడిగా మారింది. డోలు వాయిద్యాలు.. పూల వర్షం మధ్య పారా వీరులు వారి స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. 

న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్ల బృందం మంగళవారం భారత గడ్డపై అడుగుపెట్టిం ది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన పతక వీరులకు అపూర్వ స్వాగతం లభించింది. పతకాలు సాధించిన అథ్లెట్లను చూడ డానికి అభిమానులు తరలిరాగా.. తమ వాళ్లను చూడడానికి వచ్చిన అథ్లెట్ల కుటుంబసభ్యులు మిఠాయిలు పంచి పెట్టారు. అనం తరం డోలు వాయిద్యాలు, బాణాసంచా వెలుగుల మధ్య అథ్లెట్లు స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు.

పారిస్‌లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 75 లక్షలు, రజతం సాధించిన వారికి రూ. 50 లక్షలు, కాంస్యం దక్కించుకున్న అథ్లెట్లకు రూ. 30 లక్షల నజరానా ప్రకటించడం విశే షం. కాగా దీప్తి సహా కొంతమంది అథ్లెట్ల బృందం ముందే భారత్‌కు చేరుకోగా.. సుమి త్ అంటిల్, ప్రీతి పాల్, హర్వీందర్, సిమ్రన్, నితేశ్ కుమార్ సహా మరికొంతమంది అథ్లెట్లు మంగళవారం భారత్‌కు చేరుకున్నారు.

ముగింపు వేడుకల్లో హర్వీందర్, ప్రీతి పాల్ భారత్ తరఫున పతాకదారులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక టోక్యో ప్రదర్శనను మరిపిస్తూ అత్యున్నత ప్రదర్శన కనబరిచిన అథ్లెట్లు 29 పతకాలతో సత్తా చాటగా.. పతకాల పట్టికలో భారత్ 18వ స్థానంలో నిలిచింది . పారాలింపిక్స్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు పారాలింపిక్స్‌లో 60 పతకాలు రాగా.. టోక్యో, పారిస్ కలిపి మొత్తం 48 పతకాలు (19+29) సాధించడం విశేషం. 

భారీ నజరానా..

పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన పారా అథ్లెట్లకు కేంద్రం భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. స్వర్ణం సాధించిన వారికి రూ. 75 లక్షలు, రజత పతకం గెల్చిన వారికి రూ. 50 లక్షలు, కాంస్యం కొల్లగొట్టిన వారికి రూ. 30 లక్షలు అందజేయనున్నట్లు  కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పతకాలు సాధించిన ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్‌లకు చెరో రూ. 22.5 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పతకాలు సాధించిన అథ్లెట్లను సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.‘పారా క్రీడల్లో దేశం ముందుకు వెళ్తోంది. 2016లో కేవలం 4 పతకాలు మాత్రమే సాధించిన మన పారాలు, పారిస్‌లో 29 పతకాలు సాధించి 18వ స్థానంలో నిలిచారు’ అని అన్నారు.