10-02-2025 05:28:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి నిర్మల్ లో సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవనానికి చేరుకున్న వెంటనే బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి బిజెపి నాయకులు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చ అందించారు. పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ రెడ్డి సుధాకర్ ఆమెడ శ్రీధర్ మంచిర్యాల నాగభూషణం తదితరులు ఉన్నారు.