calender_icon.png 30 September, 2024 | 7:03 AM

బెంగాల్‌లో శంకరాచార్యకు ఘనస్వాగతం

30-09-2024 02:06:56 AM

కోనానగర్ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

అరుణాచల్, నాగాలాండ్, మేఘాలయలో శిష్యులకు గోధ్వజ బాధ్యతలు

కోల్‌కతా, సెప్టెంబర్ 29: గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర చేపట్టిన జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీ జీకి పశ్చిమ బెంగాల్‌లో ఘనస్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో త్రిపుర రాజధాని అగర్తల నుంచి కోల్‌కతాకు చేరుకున్న స్వామీజీకి పెద్ద ఎత్తున భక్తులు స్వాగ తం పలికారు.

దారి పొడవునా నినాదాలు చేస్తూ పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం హుగ్లీ జిల్లా కోనానగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం ఆల య ప్రాంగణంలో భక్తులకు దర్శనమిచ్చా రు. నేడు కోల్‌కతాలో గోప్రతిష్ఠ ధ్వజాన్ని స్థాపించనున్నారు. 

3 రాష్ట్రాల బాధ్యతలు శిష్యులకు..

అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయలో గోధ్వజ స్థాపన యాత్రకు అక్కడి ప్రభుత్వాలు అంగీకరించలేదు. దీంతో ఆ రాష్ట్రాల నుంచి శంకరాచార్య స్వామీజీ వెనుదిరగాల్సి వచ్చింది. మిజోరానికి సైతం వెళ్లలేదు. మిజోరంలో కొంతమంది శిష్యులకు జెండాలను ఇచ్చామని తెలిపారు.

వాళ్లు అక్కడ స్థాపిస్తారని పేర్కొన్నారు. అరుణాచల్, నాగాలాండ్, మేఘాలయకు చెందిన ముగ్గురు శిష్యులు అనిల్ అగర్వాల్, అశోక్ అగర్వాల్, రతన్ గుప్తాలకు అందజేశారు. వీరు తమ ఇంటిలో గోధ్వజ్‌ను స్థాపించి పూజిస్తారని వెల్లడించారు. మూడు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు జెండా ఎగురవేశానని, కానీ ధ్వజాన్ని స్థాపించలేదని పేర్కొన్నారు.