calender_icon.png 22 April, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం

21-04-2025 06:18:47 PM

వనమా ఆధ్వర్యంలో కదలిన కార్యకర్తలు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కొత్తగూడెం బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో భారీగా తరలివెళ్లారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో భాగంగా సుమారు 50 కార్లలో వందలాదిగా వనమా రాఘవ ఆధ్వర్యంలో భద్రాచలంలో స్వాగతం పలికారు. జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క జై వనమా అంటూ నినాదాలతో హోరెత్తించారు. పెద్దాయన వనమా ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితను రాములవారి శాలువాతో ఆయన సన్మానించి, శ్రీ సీతారాముల వారి ప్రతిమను ఆమెకు బహుకరించారు.