calender_icon.png 15 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనూ బాకర్‌కు ఘనస్వాగతం

08-08-2024 02:05:22 AM

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి స్వదేశానికి తిరిగొచ్చిన భారత షూటర్ మనూ బాకర్‌కు ఘనస్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. బాకర్ వెంట ఆమె కోచ్ జస్పాల్ కూడా ఉన్నారు. 10 మీటర్ల వ్యక్తిగత, మిక్సడ్ టీమ్ ఎయిర్ పిస్టల్ విభాగాల్లో మనూ కాంస్యాలు సాధించిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ నుంచి  ఓపెన్‌టాప్ కారులో ర్యాలీగా బయల్దేరిన మనూ బాకర్ అనంతరం కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయను మర్యాద పూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మనూకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. కాగా ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మనూ బాకర్ పతాకధారిగా వ్యవహరించనుంది. దీంతో శనివారం మనూ తిరిగి పారిస్‌కు బయల్దేరి వెళ్లనుంది.