calender_icon.png 16 January, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీప్తి జీవాంజికి ఘనస్వాగతం

07-09-2024 01:42:31 AM

  1. గోపిచంద్‌తో ఓరుగల్లు బిడ్డ 
  2. పారాలింపిక్స్‌లో దీప్తికి కాంస్యం

హైదరాబాద్: పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి స్వదేశానికి చేరుకుంది. మహిళల 400 మీటర్ల టీరూt20 ఈవెంట్‌లో దీప్తి కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. గత మంగళవారం జరిగిన 400 మీ ఈవెంట్ ఫైనల్లో దీప్తి గమ్యాన్ని 55.82 సెకన్లలో చేరి కాంస్యం ఒడిసిపట్టింది. గురువారం పారా అథ్లెట్లు స్వదేశానికి చేరుకోగా.. శుక్రవారం దీప్తి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. పారాలింపి క్స్‌లో పతకంతో మెరిసిన దీప్తికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

అనంతరం గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చేరుకున్న దీప్తికి కోచ్ నాగపురి రమేశ్‌తో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ నిశా విద్యార్థి ఆమెకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ..  దీప్తి తమ అకాడమీలో శిక్షణ పొంది ఇవాళ అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుతోంది. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న దీప్తి తాజాగా పారాలింపిక్స్‌లో పతకంతో మెరవడం అభినందనీయం.

భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని తెలిపారు. కాగా జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేయడంలో కోచ్ నాగపురి రమేశ్ పాత్ర కీలకం. దీప్తి హైదరాబాద్ రావడానికి ఆయనే ప్రధాన కారణం. రమేశ్ సహకారంతో గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్న దీప్తి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో సత్తా చాటుతోంది.