బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రెండుసార్లు జనం గుణపాఠం చెప్పినా బీఆర్‌ఎస్‌కు ఏమాత్రం బుద్ధి రాలేదని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ.. ఆ పార్టీ నేతల తీరు హీనంగా ఉందన్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సాగిన తమ టూర్ విజయవంతం అయిందన్నారు. భారీ పెట్టుబడులతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ సర్కారుపై విషప్రచారం చేస్తోందన్నారు. తమది పోటీ పర్యటన కాదని స్పష్టం చేశారు.
తమ విదేశీ పర్యటన ఫ్లాప్ అయిందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలపై శ్రీధర్‌బాబు మండి పడ్డారు. ఎవరు ఫ్లాపో మొన్నటి ఎన్నికల్లోనే ప్రజలు డిసైడ్ చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. ప్రభుత్వ ఆలోచనను విదేశీ ప్రతినిధులకు చెప్పామని, ఇక్కడ పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆసక్తి చూపాయ న్నారు. స్కిల్ వర్సిటీ ఆలోచనను విదేశీ కంపెనీలు అభినందించాయని వెల్లడించారు.