25-04-2025 11:06:29 PM
ఉట్నూర్ (విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన జాదవ్ సాయి చైతన్య యూపీఎస్సీలో 68వ ర్యాంకుతో సివిల్స్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫలితాల అనంతరం మొదటిసారి ఉట్నూర్ కు రావడంతో సాయి చైతన్య కు స్థానిక ప్రజలు అంబేడ్కర్ చౌక్ వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బ్యాండ్ మేళాల మధ్య ఊరేగింపుగా సేవాదాస్ నగర్ లోని ఆయన నివాసం వరకు తీసుకువెళ్లారు. పలువురు పులమాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.