calender_icon.png 9 November, 2024 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వస్తే స్వాగతిస్తా!

09-11-2024 01:04:40 AM

  1. చాయ్, బిస్కట్ ఇస్తా
  2. సీఎంకు ఇష్టమైతే బర్త్‌డే కేక్ కట్ చేయిస్తా
  3. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ఏసీబీ లాంటి విచారణ సంస్థలను ప్రభుత్వం పంపితే స్వాగతిస్తానని, తాను మలేషియాకు వెళ్లలేదని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

విచారణకు ఇంటికొచ్చిన వారికి చాయ్, బిస్కెట్‌తో పాటు, సీఎం రేవంత్‌కు ఇష్టమైతే ఆయన బర్త్‌డే కేక్ కట్ చేయిస్తానని చురకలు అంటించారు. అరెస్ట్ భయంతో మలేషియాకు పారిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తన అరెస్టు కోసం ఊవ్విళ్లూరుతున్న రేవంత్‌రెడ్డి.. సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి, ఆయన సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే దమ్ముందా అం టూ నిలదీశారు.

ఆంధ్రా కాంట్రాక్టర్‌ను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి త ప్పించే ధైర్యముందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరి చేస్తున్నావంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం, మంత్రులు పర్యటనలు చేసినప్పుడల్లా బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు పెరుగుతున్నాయని కేటీఆర్ మండిపడ్డా రు.

ఎన్ని నిర్బంధాలు విధించినా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై, ప్రజలకిచ్చిన హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా నేతలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్‌రెడ్డి, ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బాధితులు ఓ చోట.. పాదయాత్ర మరోచోట

పుండు ఒకచోట ఉంటే మందు మరోచోట రాసినట్టు, మూసీ బాధితులు ఉన్నచోట పాదయాత్ర చేయకుండా ఇతర ప్రాంతాల్లో సీఎం రేవంత్ పాదయాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వేల ఇండ్లను కూల్చి, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసేందుకు కుట్ర లు పన్నుతున్నారని, దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర పేరిట డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు.

లక్షలాది మంది అక్రందణలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి లేవన్నారు. మూసీని మురికికూపంగా మార్చిన ఘనత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలేదనన్నారు. కనికరం లేకుండా కాల్చి చంపిన దోషులే సంతాపసభకు వచ్చి కన్నీరు కార్చినట్టుందన్నారు.