calender_icon.png 22 October, 2024 | 1:05 PM

కొత్త వీసీకి సమస్యల స్వాగతం

21-10-2024 12:00:00 AM

కరీంనగర్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులైన ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరిం చనున్నారు. శనివారం సచివాలయంలో ఇంచార్జి వీసీ అయిన ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ నుంచి చార్జి తీసుకున్నారు. సోమవారం యూనివర్సిటీకి రాను న్నారు. ఉమేశ్‌కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండేండ్లు రిజిస్ట్రార్‌గా పని చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెం దిన ఉమేశ్‌కుమార్ రసాయనశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2018 మధ్య రిజి స్ట్రార్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో ఇన్‌చార్జి వీసీగా చిరంజీవులు వ్యవహరించారు. రిజిస్ట్రార్‌గా విశ్వవిద్యాలయ మొదటి స్నాతకో త్సవం నిర్వహించి మన్ననలు పొందారు.

విశ్వవిద్యాలయంలో రహదారులు, వసతిగృహాల నిర్మాణాలు, అంబులెన్స్ ఏర్పాటు, ఏ టీఎం సదుపాయం కల్పించారు.రిజిస్ట్రార్ గా పనిచేసిన అనుభవంతో శాతవాహన విశ్వవిద్యాలయాన్ని గాడిలో పెడతారన్న ఆ శాభావాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. 

ఇకనైనా సమస్యలు తొలగేనా 

శాతవాహన విశ్వవిద్యాలయంలో సమస్యలతోపాటు విజిలెన్స్ విచారణ ఎదు ర్కొన్న ఘటనలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. యూనివర్సిటీకి ఇప్పటికే 12బీ హోదా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో నిధులను రాబట్టడంలో పాత వీసీ విఫలమయ్యారు. కొత్త వీసీ ఈ దిశలో దృష్టిసారిస్తే నిధులు వచ్చే అవకాశం ఉంది.

మాజీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం హయాంలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ జరిగింది. టెండర్లు లేకుండా వరుసగా రెండేళ్ల పాటు ప్రైవేట్ ఏజెన్సీకి ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులు అప్పగించడం, పరీక్షల విభాగంలో విశ్రాంత ప్రొఫెసర్లను ఫ్యాకల్టీగా నియమించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పెట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

వాహనాల కొనుగోలు, యాక్సి డెంట్ ఖర్చుల మీద, చలాన్ల మీద విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. పరిపాలన భవనం మొదటి అంతస్తు నిర్మాణంలో సరైన ప్రమాణాలు, నాణ్యత పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి. విశ్వవిద్యాలయానికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కోట్లలో ఖర్చు చేయడం, పరీక్ష విభాగంలో ప్రశ్నాపత్రాలు లీక్ లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎగ్జామినేషన్ బ్రాంచిలో 2015లో కొనసాగుతున్న కంట్రోలర్ డాక్టర్ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్‌ను తొలగించాలని ఆందోళనలు సైతం జరిగాయి. 2021 2022 సంవత్సరాల్లో జరిగిన ఆడిట్ రిపోర్టలపై కూడా విచారణ జరపాలనే డిమాండ్ ఉంది. 

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దుకు డిమాండ్ 

గత వీసీ హయాంలో ఏర్పాటు చేసిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రద్దు చేసి, రెగ్యులర్ చేయాలని విద్యార్థుల నుంచి డిమాండ్ ఉంది. బాటనీ, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లిష్.. ఈ నాలుగు కోర్సులను సెల్ఫ్ ఫైనా న్స్ కోర్సులుగా మార్చారు. పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఈ కోర్సులు చదవలేని పరిస్థితి నెలకొంది.

వీటిని రెగ్యులర్ చేయాలని గత కొంతకాలంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులైన ఫుడ్స్ సైన్స్, కంప్యూటర్ సైన్స్‌లను కూడా రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కోరుతున్నారు. అలాగే ఫ్యాకల్టీ కొరత, నాన్ టీచింగ్ స్టాఫ్ కొరతా ఉంది. శాతవాహన విశ్వవిద్యాలయానికి మొదట్లో ఉన్న మంచి పేరును తీసుకురావడంలో వీసీ ఉమేశ్ కుమార్ నిర్వహించే పాత్రే కీలకం కానుంది. 

* నేడు శాతవాహన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్

* సమస్యలు తొలగుతాయని విద్యార్థుల ఆకాంక్ష