calender_icon.png 18 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెకిక్ అదరహో

18-01-2025 12:53:51 AM

  • జొకోవిచ్, జ్వెరెవ్ అలవోకగా
  • సబలెంక, గాఫ్, అల్కరాజ్ జోరు
  • ఆస్ట్రేలియన్ ఓపెన్

మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పురుషుల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ మూడో రౌండ్‌ను అతికష్టంగా దాటగా.. జొకోవిచ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మాత్రం అలవోక విజయాలు అందుకున్నారు. మహిళల విభాగంలో ఏడో సీడ్ జెస్సికా పెగులాకు అన్‌సీడెడ్ షాక్ ఇవ్వగా.. నంబర్‌వన్ సబలెంకాతో పాటు గాఫ్, వెకిక్ జోరు ప్రదర్శిస్తూ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్‌లో అడుగపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 6 6 7 (7/3), 6 అన్‌సీడెడ్ బోర్గ్స్ (పోర్చుగల్)పై అతికష్టంగా నెగ్గాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో తొలి రెండు సెట్లు నెగ్గిన అల్కరాజ్ మూడో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయాడు.

కీలకమైన నాలుగో సెట్‌లో ఫుంజుకొని మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. మరో సింగిల్స్‌లో జొకోవిచ్ 6 6 6 మెక్‌హక్ (చెక్ రిపబ్లిక్)పై విజయం అందుకొని ప్రీక్వార్టర్స్‌లో అడుగపెట్టాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో రెండో సీడ్ జ్వెరెవ్ (రష్యా), హంబర్ట్, లెహెకాలు నాలుగో రౌండ్‌లో అడుగపెట్టారు.

అదరగొట్టిన వెకిక్..

మహిళల సింగిల్స్ విభాగం మూడోరౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక (బెలారస్) 7 (7/5), 6 క్లారా టాసన్‌పై గెలుపొందింది. 18వ సీడ్ డొనా వెకిక్ (క్రొయేషియా) 7 (7/4), 6 (3/7), 7 రష్యాకు చెందిన డయానా స్నైడర్‌పై విజయాన్ని అందుకుంది.

అమెరికా స్టార్ కోకో గాఫ్ 6 6 ఫెర్నాండేజ్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో బెన్సిక్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో బడోసా, డానిలోవిక్ గెలుపొందారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ స్టార్  బోపన్న (చైనా) 6 6 మ్లాదెనొవిక్ జంటపై గెలుపొంది రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.