calender_icon.png 7 February, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డిపై డబ్ల్యూఈఎఫ్ ప్రశంస

07-02-2025 12:45:37 AM

తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, నెట్ జీరో రోడ్‌మ్యాప్‌పై అభినందన

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండీ, ఎండీ మిరెక్ డసెక్ సీఎంకు గురువారం ప్రత్యేకంగా లేఖ రాశారు. వాణిజ్యం, ప్రపంచ దేశాల మధ్య సహకారం, వ్యూహాల అన్వేషణ, వాతావరణ మార్పులు, ప్రకృతిని కాపాడటం కోసం తీసుకోవాల్సిన చర్యల విషయమై కలిసిరావడంపై సీఎంను అభినందించారు.

అలాగే, రాబోయే 10 ఏళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలన్న సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికతకు డబ్ల్యూఈఎఫ్‌కు వచ్చిన ప్రతినిధులు ఫిదా అయినట్లు పేర్కొన్నారు. సాంకేతికత, సుస్థి రాభివృద్ధి, ఇంధనం, ప్రతిభలో తెలంగాణను అగ్ర గామిగా నిలిపేందుకు, పెట్టుబడులను ఆకర్షించడం కోసం వ్యూహా త్మకంగా ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్-2050’ లక్ష్యాన్ని ప్రపంచ నేతలు గుర్తించినట్టు చెప్పారు.

2047నాటికి హైదరాబాద్‌ను దేశంలోనే మొదటి నెట్ జీరో కార్బన్ సిటీగా మార్చాలన్న రేవంత్‌రెడ్డి రోడ్‌మ్యాప్, ఏఐకి హబ్‌గా మార్చాలన్న ప్రణాళికలు సమ్మిట్‌లో పాల్గొన్న వారిని బలంగా ఆకట్టుకున్నట్టు చెప్పారు. సీఎం తమ ప్రణాళికలను అమలు చేయడానికి, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు లేఖలో వెల్లడించారు.