భువనగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
యాదాద్రి భువనగిరి, జూలై 11 (విజయక్రాంతి): మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని, అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం భువనగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దాసరి పాండు, నాయకులు మాయ కృష్ణ, ఉదరి రాంచందర్, లక్ష్మీనారాయణ, బట్టుకొండయ్య, వరమ్మ, సునీత, రేణుక, అనిత, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.