calender_icon.png 11 February, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారాంతపు సంత.. రోడ్డుపైనే అంతా

11-02-2025 12:00:00 AM

  1. త్రిపురారంలో స్తంభిస్తున్న ట్రాఫిక్
  2. ప్రత్యేక స్థలం కేటాయించాలని స్థానికుల విజ్ఞప్తి
  3. పట్టించుకోని అధికారులు, పాలకులు

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 10: నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో జాతీయ రహదారి వెంటే వారపు సంత జరుగుతుండడంతో వాహనదారులు, పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏండ్లగా పాలకులు, అధికారులు ఈ పరిస్థితి చూస్తూనే ఉన్నా పట్టించుకోవడం లేదు.

ప్రతీ సోమవారం జరిగే సంతలో చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించిన పంటను అమ్ము కునేందుకు ఇక్కడికి వస్తారు. తెచ్చిన కూరగాయలను జనం దృష్టిలో పడాలని రోడ్డుపైన గంపలు, కుప్పలు పెట్టి అమ్మేందుకు కూర్చుంటారు.

సంతలో కూరగాయ లు కొనుక్కునేందుకు పరిసర గ్రామాల నుంచి వచ్చే వారి వాహనాలతో రహదారి సగానికిపైగా నిండిపో తుండడంతో ట్రాఫిక్ సమస్య తలె త్తుతున్నది. సంతరోజు స్థాని కులు రోడ్డు పరిసరాల్లోకి రావాలంటే ఏం ప్రమాదం జరుగుతుందోనని జంకుతున్నారు. 

ప్రమాద భరితంగా..      

సంతరోజు జాతీయ రహదారి వాహనా లతో సగానికిపైగా నిండిపోతుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరా యం కలుగుతుంది. విస్తరణకు ముందు ఈ రహదారిపై  ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉండేది. జాతీయ రహదారిగా విస్తరించ డంతో భారీ వాహనాలు వేగంగా వస్తున్నా యి. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశముంది. 

పట్టించుకోని అధికారులు..

జాతీయ రహదారి వెంట కూరగాయల సంత జరుగుతున్నా ఏండ్లుగా అధికారు లు, పాలకులు పట్టించుకోవడం లేదు. సంత నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయిం చాలని రైతులు, వ్యాపారులు పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించ డం లేదు. గతంలో అధికారులకు ఎన్నోసా ర్లు వినతి పత్రాలు ఇచ్చినా బుట్ట దాఖల య్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పార్కింగ్‌కు స్థలం కరువు.. 

మండల కేంద్రంలో వాహనాల పార్కిం గ్‌కు స్థలం లేకపోవడంతో వాహనదారులు గత్యంతర లేక జాతీయ రహదారి వెంటే నిలపాల్సి వస్తున్నది. దీంతో నిత్యం వ్యక్తిగ త అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారు రహదారి వెంట ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది.

సంతకు స్థలం కేటాయించాలి..

వారపు కూరగాయల సంతకు ప్రభుత్వం ప్రత్యేక స్థలం కేటాయిం చాలి. జాతీయ రహదారి వెంట వాహనాలు నిలపాలంటే చాలా ఇబ్బం దిగా ఉంది. సంతకు చాలామంది వస్తుండడంతో వాహనాల రాకపోకల కూ విఘాతం కలుగుతున్నది.  ఇప్పటికైనా సంత నిర్వహణకు అధికారులు అనువైన స్థలాన్ని గుర్తించాలి.        

  భాషిపాక శేఖర్, త్రిపురారం వాసి

ఇబ్బంది పడుతున్నాం..

జాతీయ రహదారి వెంట సంత నిర్వహణతో ఇబ్బంది పడుతున్నాం. వేగంగా వచ్చే వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియ ని పరిస్థితి. పాదచారులు, వాహనదారులు ఏమాత్రంర ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం పాలయ్యే అవకాశముంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందిస్తే బాగుంటుంది. 

లాల్‌బాషా, త్రిపురారం వాసి