వారాంతంలో ఆటో నడుపుతున్న సాప్ట్‌వేర్ ఇంజినీర్
న్యూ ఢిల్లీ, జూలై 22: ప్రస్తుతం సమాజంలో ప్రతీఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవితం. గ్రామీణ ప్రాం తాలు, చిన్న చిన్న పట్టణాల్లో పరిస్థితి కాస్త బెటర్‌గా ఉన్నప్పటికీ.. ద్వితీయ స్థాయి నగరాలు, మెట్రో నగరాల్లో కనీసం పక్కింటివారితో కూడా మా ట్లాడే పరిస్థితి లేదు. ఇలాంటి సమస్యే బెంగుళూర్‌లోని ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌కు ఎదురైంది. ఈ క్రమంలో వీకెండ్‌లో ఆటో డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు. తాజాగా ఆటో ఎ క్కిన ఓ ప్యాసింజర్.. ఆ ఆటో డ్రైవర్ మైక్రోసాఫ్ట్ హుడీ(జంపర్) వేసుకొని ఉండటాన్ని గమనించాడు.
మెల్లిగా అతడితో మాటలు కలపగా తాను మై క్రోసాఫ్ట్ ఇంజినీర్ అని.. ఒత్తిడి, ఒంటిరితనాన్ని అధిగమించడానికి ఇలా వీకెండ్‌లో ఆటో డ్రైవింగ్ చేస్తూ ప్యా సింజర్లతో మాట్లాడుతూ ఉంటానని తెలిపాడు. ఆ టెకీ కం ఆటో డ్రైవర్ మాటలు విని షాకైన ప్యాసింజర్ తా జాగా.. మైక్రోసాఫ్ట్ హుడీతో ఆటో నడుపుతున్న టెకీ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మా రింది. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఐటీ ఉద్యోగుల్లో ఒత్తిడి కామన్. గుడ్ డెసిషన్ ఫ్రెండ్. వావ్ వీకెండ్‌లో సంపాదించడం ఇ లా. ఎక్కువ సంపాదించడం ఇలానే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.