19-03-2025 10:45:39 PM
అమ్మకాల విషయంలో కఠిన నిబంధనలు పెట్టాలి..
తంబళ్ల రవి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో దమ్మపేట మండలం, ఇతర ప్రాంతాలలో అత్యధికంగా యువకులు క్షణికావేశంలో గడ్డి మందును సేవించడం వల్ల అధికంగా మరణాలకు గురవుతున్నారు, ఈ గడ్డి మందును కచ్చితంగా బ్యాన్ చేయాలి లేదా అమ్మకం విషయంలో పలు జాగ్రత్తలు... కఠిన నిబంధనలు పెట్టాలని, ఎంతో మంది తల్లిదండ్రులు చేతికొచ్చిన పిల్లల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. యువతకి ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నది చిన్న చిన్న గొడవలకే క్షణకావేశంలో ఆగమైపోతున్నారు. ఎక్కువక 20 నుంచి 30 సంవత్సరాల వయసు గడ్డి మందు సేవించి మరణించడం జరుగుతున్నది. చాలా కుటుంబాలు చేతికి వచ్చిన పిల్లలకు కోల్పోవడం జరుగుతున్నది. ఏదైతే పురుగుమందు షాపుల వాళ్ళు ఉన్నారో గడ్డి మందు కొనుగోలుకి వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకొని విక్రయించాలని, రాష్ట్ర ప్రభుత్వం గడ్డి మందు విషయమునీ పరిగణలోకి తీసుకొని కఠిన నిబంధనలు పెట్టాలని కోరుతున్న అని అన్నారు.