calender_icon.png 22 October, 2024 | 9:00 PM

పెళ్లంటే గుర్తొచ్చినట్టుంది

23-07-2024 12:05:00 AM

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) ధారావాహికతో చిన్నతనంలోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది అవికాగోర్. తర్వాతి కాలం లో సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టిన అవికా, తెలుగు సినిమా ‘ఉయ్యాల జంపాల’తో కథానాయికగా పరిచయమైంది. అటుపై తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో అడపాదడపా కనపడుతున్న ఆమె తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. మిలంద్ చాంద్వానీతో కొంతకాలంగా ప్రేమాయ ణం నడుపుతున్న అవికా గోర్, తమ మనసులు ఎప్పుడో కలిశాయని చెప్పుకొచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మొదలైన వీరి పరిచయం.. తర్వాత ప్రేమగా మారిందట.

మిలంద్ అంటే తనకెంతో ఇష్టమంటున్న అవికా, తనతో ఇప్పటికే మానసికంగా ముడిపడి ఉన్నట్టు తెలిపింది. పెళ్లి విషయంలోనూ ఇప్పటికే వీరిరువురి మధ్య చర్చలు జరిగాయట. వయసులో తనకంటే పెద్దవాడైన మిలంద్, పెళ్లి అనేది జీవితంలో పెద్ద విషయం కాబట్టి తమ వయసులను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని సెలవిచ్చాడట. దాంతో తాను ఇంకా ఈ విషయమై ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నా అంటోంది అవికా గోర్. పెళ్లి ప్రస్తావనతోనే వయసు గుర్తొచ్చినట్టుంది కాబోలు ఈ చిన్నారి పెళ్లికూతురికి..!