calender_icon.png 27 October, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందీప్ కిషన్‌తో పెళ్లి దుస్తుల్లో..

27-10-2024 12:00:00 AM

సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టై న్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో యాక్షన్ బ్లాక్స్‌తోపాటు ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి మేకర్స్ తా జాగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్- రీతూ వర్మల హ్యుమరస్ అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్ర బృం దం విడుదల చేయగా, అది ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఇం దులో రీతు పెళ్లి దుస్తుల్లో అం దంగా కనిపించింది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్; సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ; కథ, మాటలు స్క్రీన్‌ప్లే: రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ.