హీరో నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అతిథులకు అందిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నాగ చైతన్య, శోభితల వివాహం జరుగనుంది. ఈ క్రమంలోనే వారి వివాహ ఆహ్వాన పత్రికలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతిథులకు కేవలం పెళ్లి కార్డు మాత్రమే కాకుండా చీర, పసుపు, కుంకుమ, వెండి వస్తువులతో కూడిన బుట్టను అందిస్తున్నారు. వివాహ ఆహ్వాన పత్రికలో వధువు, వరుడి తల్లిదండ్రులతో పాటు, ఇరువురి తాతయ్య, బామ్మల పేర్లను కూడా చేర్చారు. ఆహ్వాన పత్రిక సింపుల్‌గానే అనిపిస్తోంది కానీ అందించే బుట్ట మాత్రం బరువుగానే అనిపిస్తోంది.