మంత్రి తుమ్మలను కలిసిన చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పద్మశాలి సంఘ నాయకులు, చేనేత సహకార సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలలోని వస్త్ర నిల్వలను , ప్రభుత్వ శాఖలకు సప్లు చేసే వస్త్రంతో పాటుగా షోరూంలలో అమ్మే వస్త్రాలను కూడా కొనుగోలు చేయాలని, మర మగ్గాల సంఘాల నుంచి వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలని, ఇప్పటి వరకు ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేనేత కార్మికుల్ని పట్టించుకోలేదని కానీ మా ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి అన్ని విధాలా మేలు జరిగేలా చూస్తామని మంత్రి హమీ ఇచ్చారు.