హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తెలంగాణలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. అత్యల్పంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చతి పెరగడంతో ష్వెటర్లు, రగ్గుల కొనుగోలుపై జనాలు దృష్టిసారించారు.
2024 సంవత్సరంలో దాదాపు ప్రతి నెల హీట్ రికార్డు బద్దలు కొట్టింది. ఈ జాబితాలో నవంబర్ నెల కూడా చేరింది. నెలాఖరులో చలి పెరగడం ప్రారంభించింది. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, యూపీ సహా ఉత్తర భారతదేశంలో చలిగాలులు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రస్తుతం పగటిపూట, సాయంత్రం చలిగా మారుతోంది. అదే సమయంలో రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో 'ఫెంగల్' తుపాను ప్రభావంతో చెన్నై నగరంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఐఎండీ ప్రకారం, తుఫాను 'ఫెంగల్' ఈ మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలను దాటుతుంది. దీంతో తమిళనాడులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీని వణికిస్తున్న చలి
దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు మొదలయ్యాయి. ఉదయం, సాయంత్రం కూడా చలిగా ఉంటుందని ప్రజలు తెలిపారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ సీజన్‌లో అత్యంత శీతలమైన రోజు శుక్రవారం నమోదైంది. గత కొన్ని రోజులుగా రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అక్యూవెదర్ సైట్ ప్రకారం, శుక్రవారం రోజు గడిచేకొద్దీ, కనిష్ట ఉష్ణోగ్రత కూడా పడిపోతుంది. రాత్రి 8 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అర్థరాత్రి వరకు ఇది 11 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. శనివారం తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి పూట కూడా ఇదే పరిస్థితి, పగటిపూట ఆకాశం నిర్మలంగా ఉంటుందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 26.4, కనిష్ట ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడు రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.