చలి తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. సాయంత్రం ఐదు గంటలకే చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రతను తట్టుకునే క్రమంలో కొందరు పాదాలకు సాక్సులు వేసుకుని పడుకుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదనీ, దీనివల్ల పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునేటప్పుడు సాక్సులు వేసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం..
రాత్రంతా సాక్సులు వేసుకుని పడుకోవడం వల్ల కాళ్లలో చమట పేరుకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటు ంది. ఇది చర్మం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని అంటున్నారు. సాక్సులు వేసుకోవడం వల్ల పాదా ల నొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నా రు. ముఖ్యంగా అప్పటికే పాదాలలో సమస్య ఉంటే అది పెరిగే అవకాశం ఉం టుంది. రాత్రంతా సాక్సులు వేసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. కాళ్లలో తలెత్తే సమస్యల కారణంగా నిద్ర కూడా సరిగ్గా పట్టదు.
చల్లని వాతావరణంలో సాక్సులు వేసుకుంటే ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చర్మ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక చాలా బిగుతుగా ఉండే సాక్సులు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది నరాలపై ఒత్తిడి పెంచి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.