calender_icon.png 13 January, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందుని పాలనలో పాలు పొరలే సంపద

27-12-2024 12:00:00 AM

కనైత్తు= (పాలు పితికే వారు లేకపోవడం వల్ల) అరచి, ఇళం కన్ఱు ఎరు మై= లేగదూడలనుగల ఎనుములు, కన్ఱుక్కు ఇఱంగి= లేగలపై జాలిగొని, నినైత్తు= దూడ తన పొదుగులో మూతి పెట్టినట్టు తలచి, పా ల్ శోర= పాలు కార్చుచుండగా, ఇల్లమ్ ననై త్తు= ఇల్లంతా తడిసి, శేఱు ఆక్కుమ్= బురద అవుతున్నట్టున్న, నర్ చెల్వన్= శ్రీకష్ణ కైంకర్యంతో గొప్ప ఐశ్వర్యం కలిగిన వ్యక్తి, తం గాయ్= చెల్లెలా, తలైపనివీఝ= మా తలలపై మంచు పడుతుండగా, నిన్ వాశల్ కడైపట్రి= నీ ఇంటిగుమ్మాన్ని పట్టుకుని, తెన్ ఇలంగైకోమానై= సిరిసంపదలతో విరాజిల్లే లంకకు రా జైన రావణాసురుని, శినత్తినాల్ చ్చెట్ర= శ్రీదేవి నుంచి ఎడబాటు చేసినాడన్న కోపం తో చంపిన, మనత్తుక్కు ఇనియాయై= మన సుకు హాయి కలగించే (మనోహరుడైన) శ్రీరా మచంద్రుని, ప్పాడవుమ్= మేము స్తు తించినప్పటికీ, నీవాయ్ తిఱవాయ్= నీ నోరు తెరి చి మాట్లాడడం లేదే, ఇనిత్తాన్= ఇకనైనా, ఎ ఝుందిరాయ్= మేలుకో, ఈదు ఎ న్న పేరురక్కమ్= ఇదేమి పెద్ద నిద్ర, అనైత్తు ఇల్లత్తారు మ్= గోకులం ఇళ్లలోని వారందరికీ, అఱిం దు= నీ గాఢనిద్ర గురించి తెలిసిపోయింది.

దూడలున్న గేదెల పాలు పితికేవారు లేకపోవడం వల్ల అవి అరుస్తూ, తమ లేగలు మూతి పెట్టి తాగుచున్నట్టు భావించి పొదుగులద్వారా ఎడతెగకుండా పాలు స్రవిస్తుండ డం వల్ల ఇల్లంతా బురదై పోయేంతగా శ్రీకష్ణ కైంకర్యరూపమైన గొప్ప సంపద కలిగిన వారి చెల్లెలా, మా తలలమీద మంచు కురుస్తున్నా మీ గుమ్మం ముందు నిలబడి ఉన్నాం.

సీతాదేవిని తన నుంచి విడదీసాడన్న కోపంతో సంపన్మయమైన లంకాధిపతి రావణుడిని చంపిన వాడూ, మనసుకు హాయి కూర్చువా డూ అయిన శ్రీరాముని మేము స్తుతిస్తున్నప్పడికీ నీవు నోరు తెరవడం లేదే? ఇకనైనా లేవ మ్మా, ఇదేమి గాఢనిద్ర, ఊరు ఊరంతా నీ ని ద్ర గురించి తెలిసిపోయింది. గేదెలకు పాల చే పులు వస్తున్నాయి. దగ్గర్లో దూడలు లేవు. యజమానులు పాలు పితకడం లేదు. దూ డలు తమ పొదుగులను నోట్లో పెట్టుకున్నట్టు భావించి దయతో గేదెలే పాలను స్రవిస్తున్నాయి.

దాంతో పాలు ఇల్లంతా నిండి బుర ద బురద అయింది. గేదెలకున్న దయాభా వం నీకు మాపట్ల లేదే. ఆశ్రితుల విషయంలో భగవంతుడు ఈ గేదెలవలె పరితపిస్తుంటాడట. మేఘాలు తెరపి ఇస్తూ కురుస్తాయి కాని, ఈ గేదెలు ఎడ తెరిపి లేకుండా పాలు కురుస్తున్నాయి. నీ ఇంట్లో గేదెలు దూడలను తలచుకుని పాలిస్తున్నాయే, నీ కోసం మేము వచ్చినా నీవు ఓ మాటైనా పలకడం లేదే.

లక్ష్మణుడు అన్న కార్యంలో నిమగ్నమై ఉండి అగ్నికార్యం మరిచినట్టు, యాదవులు శ్రీకృష్ణ కైంకర్యంలో పడి విద్యుక్తధర్మమైన పాలు పితికే పని వదిలేసారట. భగవంతుడిపై ప్రేమతో అతణ్ణి విడిచి ఉండలేక స్వధర్మాన్ని మరిచిపోతే దోషమే కాదు. ఈ అంశాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఈ విధంగా వివరించారు: “ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్యకర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు.

లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు. తను రాముని సేవలో నిమగ్నమై తన దైనందిన బాధ్యతలను (నిత్యకర్మలు) పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేసాడు. తన బాధ్యతలను నిత్యకర్మలను పాటించేవాడు. భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేసింది రామునికోసమే. లక్ష్మణుడు నిత్యకర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈరోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే”.