23-03-2025 01:04:11 AM
రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు
ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్, మార్చి 2౨ (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడినట్టు హైదరా వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజులు పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గనున్నట్టు వెల్లడించింది.
ఈక్రమంలో వర్షసూచన ఉన్న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని ఉందని, దీంతో ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు ఐఎండీ చెప్పింది. మెదక్‌లో శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత జగిత్యాల, కరీంనగర్‌లో 57 మిల్లీమీటర్లు, రాజన్న సిరిసిల్లలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.