నేడు, రేపు పొడి వాతావరణం
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం పూర్తిగా బలహీనపడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రాబోయే ఐదు రోజులపాటు కొన్ని జిల్లాల్లో పొగమంచు ఏర్పడొచ్చని వెల్లడించింది.
సాధరణ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని, తద్వారా చలి తీవ్రత కూడా అంతగా ఉండదని ఐఎండీ చెప్పింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గార్లలో అత్యధికంగా 8.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వనపర్తిలో 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ వివరించింది.