06-03-2025 12:36:48 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (విజయక్రాంతి): బీసీలను కించపరిచేలా ఎవ యు వ్యవహరిస్తే వదిలిపెట్టబోమని, తెలంగాణలో మలిదశ బీసీ ఉద్యమం ప్రారం మైందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో రేవంత్‌రెడ్డిని విమర్శించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
అగ్రవర్ణాలకో న్యాయం, బీసీలకో న్యా అని ప్రశ్నించారు. కులగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినందునే తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 20 లక్షల మంది బీసీలు కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 శాతం ఉన్న అగ్రవర్ణాల జనాభా పెరిగిన చూపించారని, ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట 25 వేల ఉద్యోగాలు ఎత్తుకుపోయారని ఆరోపించారు.
60 శాతం ఉ జనాభా తగ్గినట్లు చూపించారని విమర్శించారు. అందుకే తాను సర్వే రిపోర్టును తగులబెట్టానని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే కాంగ్రెస్‌ను వ్యతిరేకిం అని విమర్శించారు. కాంగ్రెస్ సర్వే కంటే కేసీఆర్ హయాంలో చేయించిన సర్వేనే బాగుందన్నారు. 2028లో తెలంగాణకు బీసీ సీఎం అవుతారని చెప్పారు.
షోకాజ్, సస్పెన్షన్, పిల్లిగాండ్రింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి తనను పంపిస్తే బీసీ వాదం ఉండదనుకున్నారని, గ్రామగ్రామానికి బీసీ వాదాన్ని తీసుకుపోతామని, అన్ని పార్టీల్లోని బీసీ బిడ్డల కోసం పోరాడుతామని తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేదిలేదని, ఏపార్టీ పెట్టడం లేదని బీసీల కోసమే ఐక్యంగా పోరాడుతామన్నారు.