04-03-2025 01:50:59 AM
పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
పరిగి : మార్చి 3 : (విజయ్ క్రాంతి ): శ్రీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేస్తానని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం పరిగిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైనారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాల యం చైర్మన్గా సిద్ధాంతి పార్థసారథి ప్రమాణ స్వీకారం చేశారు.
శెట్టి నర్సింలు, ఎర్రగడ్డ పల్లి గోపాల్, సురేఖ రెడ్డిలు నంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్గా ఎన్నికైన సిద్ధాంతి పార్థసారథికి, నంబర్లుగా ఎన్నికైన శెట్టి నర్సింలు, ఎర్రగడ్డ పల్లి గోపాల్ , సురేఖ రెడ్డి లకు పూలదండలు శాలువాలతో ఘనంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఎమ్మెల్యేను చైర్మన్ కమిటీ సభ్యులు సన్మానించారు.
ప్రమాణ స్వీకార అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ .శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అని 2014లోనే ఆలయ కమిటీ కోసం ఈవోను నియమించడం జరిగిందని ఆలయ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఉంటే అది పారదర్శకంగా చేయకుండా అప్పటి ప్రభుత్వం తాత్కాలిక స్టే తీసుకురావడం జరిగిందని తెలిపారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను మార్చి 9,10,11 మూడు రోజులు నిర్వహించడం జరుగుతుందని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, హిందూ బంధుమిత్రులందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అన్నారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభివృద్ధిలో భాగ్యస్వాములు కావాలని,ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు.
పరిగి పట్టణంలోని కిష్టమ్మ గుడి తండాలో ఉన్న కృష్ణుడి అభివృద్ధి చేస్తానని,అదేవిధంగా కుల్కచర్ల మండలంలోని పాంబండ ఆలయ అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి 80 కోట్ల రూపాయలతో టెంపుల్ టూరిజం నిర్మించాలని ప్రణాళికను అందించడం జరిగింది తొందరలోనే మంజూరు కావడం జరుగుతుందని,
అదేవిధంగా పూడూరు మండలంలోని దామగుండం 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన శివుడి ఆలయం ఉందని పరిగి నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి వైఫ్ చైర్మన్ అయూబ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.