28-04-2025 11:18:20 PM
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సమగ్రమైన బ్యాడ్మింటన్ క్రీడా పాలసీలు వచ్చేందుకు కృషి చేస్తామని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్(Indian badminton chief coach Pullela Gopichand) అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్(బ్యాట్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశం జరిగింది.
గోపిచంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడలు అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నామని అందులో భాగంగానే సోమవారం బ్యాట్ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉపాధ్యక్షులు చాముండేశ్వరీ నాథ్, జి. వెంకటేశ్వర్ రావు, రమేశ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు రవికుమార్, మనోజ్ కుమార్, యువిఎన్ బాబు, కోశాధికారి వంశీధర్, మెంబర్లు పిసీఎస్ రావు, రామ్మోహన్, రంగారావు, సూరి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సుధాకర్, నాగమణిలతో పాటు రాష్ట్రంలోని 19 జిల్లాల నుంచి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శులు హాజరయ్యారు.
అనంతరం బ్యాట్ సలహాదారునిగా కే.లక్ష్మణ్, బ్యాట్ మీడియా కోఆర్డినేటర్‌గా వెంకటరమణారెడ్డిని నియమించారు. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస గుప్తా, కోశాధికారి హర్ష, వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎండీ బాషా తదితరులు పాల్గొన్నారు.