calender_icon.png 8 February, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

08-02-2025 12:00:00 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య

చేగుంట ఫిబ్రవరి 7 ః తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచిన బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య శుక్రవారం చేగుంట మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారాన్ని కృషి చేస్తానని, జీవో 317 సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని, అన్ని పాఠశాలలకు ఒకే పని వేళలు  ఉండాలని, పెండింగ్ డిఏ, జిపిఎఫ్ లోనులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కార్పొరేట్ హాస్పటల్లో హెల్త్ కార్డులు పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గురుకుల పాఠశాల సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ మినిమం పేస్కేల్ ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తపస్  రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నవ్వాత్ సురేష్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్, తూప్రాన్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు  జానకిరామ్ గౌడ్, నర్సింగ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి  రాకేష్, తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  వెంకటేష్ కృష్ణమూర్తి, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.