ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి ౫ ( విజయక్రాంతి ): త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా మంగళ వారం భువనగిరి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విద్యారంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, గురుకుల,మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, కెజిబివి ఉపాధ్యాయులకు సమ్మె కాలం వేతనం ఇవ్వాలని, కనీస స్కేల్ ను అమలు చేయాలనీ, వారి సర్వీస్ ను రెగ్యులర్ చేయాలనీ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరానని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు ముక్కెర్ల యాదయ్య, మెతుకు సైదులు, మోడల్ స్కూల్ రాష్ట్ర ప్రధాన బాధ్యులు సిలవేరు మహేష్*జిల్లా కార్యదర్సులు జి వి రమణా రావు, జి. బాలయ్య, పి సుదర్శన్ రెడ్డి,సంగు వనిత, కె వెంకన్న, ఐ. సంజీవ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, కె. గోపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు